Teegala Krishna Reddy Meet Chandrababu: మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తీగల కృష్ణారెడ్డి, మ‌న‌వ‌రాలి పెళ్లికి ఏపీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి

ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ లోని చంద్ర‌బాబు నివాసంలో ఆయ‌న్ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తీగ‌ల కృష్ణారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

Former minister MLA Malla Reddy and Teegala Krishna Reddy met Andhra Pradesh Chief Minister Chandrababu

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ లోని చంద్ర‌బాబు నివాసంలో ఆయ‌న్ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తీగ‌ల కృష్ణారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

తాను టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్‌తో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంద‌ని గుర్తు చేసిన ఆయ‌న‌... హైద‌రాబాద్ అభివృద్ధి చేసింది వంద‌కు వంద‌శాతం చంద్ర‌బాబేన‌ని అన్నారు. తెలంగాణ‌లో టీడీపీ పాల‌న మ‌ళ్లీ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.

జీహెచ్ఎంసీని కూల్చివేస్తారా ? ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల సంగతేంటి, ప్రభుత్వానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సూటి ప్రశ్న

ఇక చంద్ర‌బాబును క‌లిసిన మ‌ల్లారెడ్డి త‌న‌ మ‌న‌వ‌రాలు శ్రేయ‌రెడ్డి పెళ్లికి సీఎంను ఆహ్వానించారు. గ‌తంలో మ‌ల్లారెడ్డి, మాధ‌వ‌రం కృష్ణారావు, తీగ‌ల కృష్ణారెడ్డి టీడీపీలో ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో టీడీపీని వీడారు. మ‌ల్లారెడ్డి మ‌న‌వ‌రాలు పెళ్లి కార‌ణంగా చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు టీడీపీ అధినేత‌ను క‌లిశారు.

Here's Pics And Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)