Gautam Adani Bribery Case: అమెరికా న్యాయ‌శాఖ ఇచ్చిన తీర్పుపై కోర్టుకు వెళ్లనున్న అదాని గ్రూపు, సంస్థపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టివేత

ఆ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని పేర్కొన్న‌ది. ఈ మేరకు అదానీ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది.

Gautam Adani (File Image)

గౌతం అదానీ గ్రూపు(Adani Group)పై అమెరికా న్యాయ‌శాఖ చేసిన ఆరోప‌ణ‌ల‌ను adani group కంపెనీ కొట్టిపారేసింది. ఆ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని పేర్కొన్న‌ది. ఈ మేరకు అదానీ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. ప్రకటనలో అమెరికా న్యాయ‌శాఖ ఇచ్చిన తీర్పుపై లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు అదానీ సంస్థ వెల్ల‌డించింది. అత్యున్న‌త స్థాయి ప‌రిపాల‌న‌, పార‌ద‌ర్శ‌క‌త‌కు క‌ట్టుబ‌డి అదానీ గ్రూపు ప‌నిచేస్తుంద‌న్నారు. త‌మ సంస్థ చ‌ట్టానికి లోబ‌డి ప‌నిచేస్తుంద‌ని వాటాదారుల‌కు, భాగ‌స్వామ్యుల‌కు, ఉద్యోగుల‌కు చెబుతున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు

సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టు కోసం అదానీ గ్రీన్ కంపెనీకి చెందిన డైరెక్ట‌ర్లు.. అమెరికా పెట్టుబ‌డీదారుల‌కు ముడుపులు ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు అమెరికా కోర్టు పేర్కొన్న‌ది. ఆ కేసులో గౌతం అదానీతో పాటు మ‌రో ఏడుగురికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అమెరికా న్యాయ‌శాఖ ప్ర‌కారం.. నేరాభియోగాలు కేవ‌లం ఆరోప‌ణ‌లు మాత్ర‌మే అని, దోషులుగా తేలే వ‌ర‌కు డిఫెండెంట్ల‌ను అమాయ‌కులుగా భావించాల‌ని కోర్టు చెప్పిన‌ట్లు ఆ స్టేట్మెంట్‌లో తెలిపారు.

Adani Group Denies US Bribery Charges

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)