Gautam Adani Slips to 7th Position: ఒక్క రోజులో రూ.48.600 కోట్ల మేర తుడిచి పెట్టుకు పోయిన గౌతం అదానీ ఆస్తులు, నంబర్ వన్ నుంచి ఏడవ స్థానానికి పడిపోయిన బిలియనీర్

అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీల స్టాక్స్‌, బాండ్లు మూడు నుంచి ఏడుశాతం న‌ష్ట‌పోయాయి. ప్ర‌స్తుతం అదానీ వ్య‌క్తిగ‌త సంప‌ద 113 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

Gautam Adani (File Image)

భార‌త్‌, ఆసియా కుబేరుడు గౌతం అదానీ వ్య‌క్తిగ‌త సంప‌ద ఒక్క‌రోజులోనే రూ.48.600 (600 కోట్ల డాల‌ర్లు) కోట్ల మేర‌కు తుడిచి పెట్టుకు పోయింది. అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీల స్టాక్స్‌, బాండ్లు మూడు నుంచి ఏడుశాతం న‌ష్ట‌పోయాయి. ప్ర‌స్తుతం అదానీ వ్య‌క్తిగ‌త సంప‌ద 113 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. అదానీ గ్రూప్ సంస్థ షేర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని, అకౌంట్స్‌లోనూ మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని అమెరికా కేంద్రంగా ప‌ని చేస్తున్న హిడెన్‌బ‌ర్గ్ అనే ప్ర‌ముఖ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో బుధ‌వారం అదానీ గ్రూప్ సంస్థ‌ల స్టాక్స్ భారీగా న‌ష్ట‌పోయాయి. గ‌ణ‌నీయంగా రుణాలు తీసుకున్న అదానీ గ్రూప్ పూర్తిగా `ఆర్థిక అనిశ్చిత స్థితి`లోకి నెట్టివేయ‌బ‌డుతున్న‌ద‌ని కూడా హిడెన్‌బ‌ర్గ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్ర‌పంచ కుబేరుల జాబితాలో గౌతం అదానీ ఏడో స్థానానకి స్థానానికి చేరుకున్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)