Goa Road Accident: కారును ఓవర్‌టేక్ చేయబోయి నదిలో పడిన ఎస్‌యూవీ, డ్రైవర్‌తో సహా నలుగురు గల్లంతు, గోవాలో విషాద ఘటన
గోవాలో ఓ కారును ఓవర్‌టేక్ చేయబోయిన ఎస్‌యూవీ.. బ్రిడ్జి రేలింగ్‌పైనుంచి నదిలో పడిపోయింది. డ్రైవర్‌తో సహా ఆ ఎస్‌యూవీలో ఉన్నవారందరూ మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఆ రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదస్థలాన్ని వీడియో చిత్రీకరించాడు
గోవాలో ఓ కారును ఓవర్‌టేక్ చేయబోయిన ఎస్‌యూవీ.. బ్రిడ్జి రేలింగ్‌పైనుంచి నదిలో పడిపోయింది. డ్రైవర్‌తో సహా ఆ ఎస్‌యూవీలో ఉన్నవారందరూ మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఆ రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదస్థలాన్ని వీడియో చిత్రీకరించాడు. ఇది ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఉన్న జువారీ నది వంతెనపై కారును ఓవర్‌టేక్ చేసేందుకు ఎస్‌యూవీ ప్రయత్నించింది. అదుపుతప్పడంతో అది వంతెన రెయిలింగ్‌లను ఢీకొని నదిలో పడిపోయింది. గోవా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, భారత నావికాదళానికి చెందిన డైవర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement