Gujarat Fire Video: వీడియో ఇదిగో, గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం, గ్యాస్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రాజ్‌కోట్‌ జిల్లాలోని మోర్బీ మాలియా జాతీయ రహదారి పక్కన గాలా గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

Gujarat Fire. (Photo Credits: Twitter | ANI)

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రాజ్‌కోట్‌ జిల్లాలోని మోర్బీ మాలియా జాతీయ రహదారి పక్కన గాలా గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

ANI Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement