Gujarat Road Accident: వీడియో ఇదిగో, ఇనుప చువ్వలతో వెళుతున్న రిక్షా పైకి దూసుకెళ్లిన బస్సు, ఇనుప చువ్వలు గుచ్చుకోవడంతో బస్సులో ఉన్న 8 మందికి గాయాలు
రిక్షాపైకి బస్సు దూసుకెళ్ళడంతో బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ రిక్షావాలా ఇనుప చువ్వల లోడ్ తీసుకుని రోడ్డుపై వెళ్తున్నాడు
గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లా, దిసా తాలూకాలోని బనాస్‌పూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రిక్షాపైకి బస్సు దూసుకెళ్ళడంతో బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ రిక్షావాలా ఇనుప చువ్వల లోడ్ తీసుకుని రోడ్డుపై వెళ్తున్నాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు రిక్షాపైకి దూసుకెళ్లింది. దాంతో రిక్షాపై ఉన్న ఇనుప చువ్వలు బస్సు కిటికిల్లోంచి లోనికి దూసుకెళ్లి ప్రయాణికులకు గుచ్చుకున్నాయి.
ఈ ఘటనలో బస్సులోని 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనలో రిక్షా కార్మికుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)