Gujarat: గుడికి వెళుతున్నభక్తులపై దూసుకెళ్లిన ఇన్నోవా కారు, ఏడు మంది అక్కడికక్కడే మృతి, తీవ్ర విచారం వ్యక్తం చేసిన గుజరాత్ సీఎం భూపేశ్ పటేల్
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవల్లీ జిల్లా కృష్ణాపూర్ సమీపంలో బనాస్‌కాంఠలోని అంబాజీ ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఇన్నోవా కారు దూసుకెళ్లింది. ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవల్లీ జిల్లా కృష్ణాపూర్ సమీపంలో బనాస్‌కాంఠలోని అంబాజీ ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఇన్నోవా కారు దూసుకెళ్లింది. ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేశ్ పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రలకు రూ.50వేలు సాయం అందిస్తామన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అంబాజీ ఆలయంలో ప్రతి ఏటా భదర్వీ పూనం ఉత్సవాలు నిర్వహిస్తారు. గుజరాత్, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. కాలినడకనే బనాస్‌కాంఠా వెళ్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులు మరాఠ్‌వాడీ వెళ్తుండగా కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)