Haryana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరు మంది అక్కడికక్కడే మృతి, పంచర్‌ అయిన కారు టైరు మారుస్తుండగా వేగంగా వచ్చి ఢీకొట్టిన ఎక్స్‌యూవీ

హర్యానాలోని రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెవారీ (Rewari) సమీపంలోని మసానీ వద్ద ఆగి ఉన్న ఓ కారును ఎక్స్‌యూవీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్కడ ఉన్న ఆరుగురు మరణించారు.

Haryana Road Accident (Photo-ANI)

హర్యానాలోని రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెవారీ (Rewari) సమీపంలోని మసానీ వద్ద ఆగి ఉన్న ఓ కారును ఎక్స్‌యూవీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్కడ ఉన్న ఆరుగురు మరణించారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. కాగా కారు టైరు పంచర్‌ కావడంతో రోడ్డు పక్కన నిలిపి.. టైరును మారుస్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఎక్స్‌యూవీ దానిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Here's ANI Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement