Kumaraswamy Corona: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కరోనా, తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన, రెండో సారి కోవిడ్ బారీన పడిన సీఎం బి.ఎస్.యడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు నిన్న కరోనా సోకింది. ఆయన కరోనా బారిన పడటం ఇది రెండో సారి. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా నిర్ధారణ అయిందని... స్వల్ప కరోనా లక్షణాలు తనలో ఉన్నాయని తెలిపారు.

HD Kumaraswamy (Photo Credits: PTI)

ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కుమారస్వామికి కరోనా సోకడంతో జేడీఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now