Heatwave in Bihar: వీడియో ఇదిగో, స్కూలుకు రాగానే ఎండ వేడిమికి సొమ్ముసిల్లి పడిపోయిన 50 మంది విద్యార్థులు
పదుల సంఖ్యలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటడంతో ఎండ తీవ్రతను విద్యార్థులు తట్టుకోలేకపోయారు.
బీహార్ లో వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరుచుకోవడంతో స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక అల్లాడిపోయారు. పదుల సంఖ్యలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటడంతో ఎండ తీవ్రతను విద్యార్థులు తట్టుకోలేకపోయారు. పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. షేక్‌పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేశారు. ఆటోలు, బైక్‌లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 50 మంది విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. ఈ ఘటనతో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దేశ రాజధానిలో రికార్డు స్థాయి టెంపరేచర్, వెను వెంటనే చిరుజల్లులు, 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతో ఢిల్లీ వాసులు విలవిల
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)