Hijab Verdict: హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్లే ప్రసక్తే లేదు, సంచలన నిర్ణయం తీసుకున్న పిటిషన్ వేసిన ముస్లిం యువతులు
హిజాబ్ వివాదంలో తమకు న్యాయం దక్కలేదని ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం యువతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కోర్టు తీర్పునకు నిరసనగా తాము హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్లేది లేదని కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
హిజాబ్ వివాదంలో తమకు న్యాయం దక్కలేదని ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం యువతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కోర్టు తీర్పునకు నిరసనగా తాము హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్లేది లేదని కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హిజాబ్ వివాదంపై మంగళవారం ఉదయం కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పుపై యువతులు కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు.
హిజాబ్‌పై తాము పోరాటం చేసి తీరతామని కూడా ఆ యువతులు ప్రకటించారు. యువతులు ముందుగా హిజాబ్ ధరించాలని, పుస్తకాలను కాదని వారు పునరుద్ఘాటించారు. హిజాబ్ లేకుండా తాము కాలేజీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఆరుగురు ముస్లిం యువతులు పాఠశాలల్లోకి హిజాబ్‌ను అనుమతించాలని పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఆరుగురిలో ఓ ముగ్గురు యువతులు తాజాగా మీడియా ముందుకు వచ్చారు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)