Exams(X)

Vijayawada, Mar 1: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు (AP Inter Exams) ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు. మార్చి 3 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు (Exams) ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.45 గంటలకే పరీక్ష హాల్‌ లోకి అనుమతిస్తారు. 9 గంటలకు ప్రశ్నపత్నం ఇవ్వనున్నందున ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి ఉండదని అధికారులు పేర్కొన్నారు. సెల్​ ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా ఒక్కో కేంద్రంలో ఫ్లయింగ్, సిట్టింగ్‌ స్వ్కాడ్‌ లను ఏర్పాటు చేశారు.

మండిపోయిన ఫిబ్రవరి.. 124 ఏండ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. మార్చిలోనూ కుతకుతే.. ఐఎండీ అలర్ట్

సెంటర్స్ వద్ద 144 సెక్షన్

ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి 20 ఎగ్జామ్ సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. కాగా, విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే ఎగ్జామ్ సెంటర్ల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. కాగా, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,00,963 మంది జనరల్ విద్యార్థులు... 44,581 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,71,021 మంది జనరల్ విద్యార్థులు హాజరుకానున్నారు.

హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి