Himachal Pradesh: ఘోర ప్రమాదం, లోయలో పడిన కారు, ఐదుగురు అక్కడకక్కడే మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, చంబా జిల్లాలో విషాద ఘటన

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని చంబా జిల్లాలో కారు లోయలో పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. చంబా జిల్లాలోని తిస్సా తహసీల్‌లోని సత్రుండి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్పారు

Accident Representative image (Image: File Pic)

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని చంబా జిల్లాలో కారు లోయలో పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. చంబా జిల్లాలోని తిస్సా తహసీల్‌లోని సత్రుండి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం చంబా మెడికల్ కాలేజీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతులు చంబాకు చెందిన రాకేష్ కుమార్, అమర్ జీత్ సింగ్, మనోహర్, రాజీవ్ శర్మ, హేమ్ సింగ్‌లుగా గుర్తించారు.లోయల ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కారు వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు, పోలీసులు సహాయచర్యలు చేపట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now