Ban On Non-Veg Food Stalls Case: ఏం తినాలో మీరే నిర్ణయిస్తారా, ప్రజలు కోరుకున్నది తినకుండా మీరు ఎలా ఆపగలరు, గుజరాత్‌లో మాంసాహార దుకాణాలు తెరవడాన్ని నిషేధించడంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

Gujarat High Court (Photo-Twitter/Live Law)

గుజరాత్‌లోని కొన్ని మున్సిపాలిటీలు తమ ప్రాంతంలో మాంసాహార దుకాణాలు తెరవడాన్ని (Ban On Non-Veg Food Stalls Case) నిషేధించాయి. దీనిపై 20 మంది వీధి వ్యాపారులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరొజు ఈ పిల్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్క్ష్యలు చేసింది. జస్టిస్ బీరెన్ వైష్ణవ్.. ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. మీకు నాన్ వెజ్ ఫుడ్ అంటే ఇష్టం లేదు, అది మీ దృష్టి. ప్రజలు బయట ఏమి తినాలో మీరు ఎలా నిర్ణయించగలరు? ప్రజలు కోరుకున్నది తినకుండా మీరు ఎలా ఆపగలరు? అంటూ ప్రశ్నించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now