Hyderabad Protest: వీడియో ఇదిగో, సుల్తాన్ బజార్ సీఐపై చేయి చేసుకున్న ఆశా వర్కర్, రూ.18000 ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన

పోలీసులు ఆశావర్కర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లకు తరలించే డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్.. సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకున్నారు. ఆశా వర్కర్ చేయిచేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు.

ASHA Worker Slaps Police Inspector (Photo Credits: X/@@jsuryareddy)

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కోఠి (Koti) డీఎంఈ కార్యాలయం ఆవరణలో సోమవారం (ASHA Workers) ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. దీంతో డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఆశాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఏసీపీ శంకర్‌ను ఆశాలు చుట్టుముట్టారు.

చంపేస్తామంటూ పవన్ కల్యాణ్‌కి బెదిరింపు కాల్స్, నిందితుడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు

దీంతో పోలీసులు ఆశావర్కర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లకు తరలించే డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్.. సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకున్నారు. ఆశా వర్కర్ చేయిచేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అయితే, అలా ఆశా వర్కర్ ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ASHA Worker Slaps Police Inspector 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement