IED Blast in Bijapur: ఛత్తీస్‌గఢ్‌లో జవాన్ల వాహనంపై పేలుళ్లతో విరుచుకుపడిన మావోయిస్టులు, 8 మంది జవాన్లతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి, పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజపూర్‌లో జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులకు పేలుళ్లకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా భేద్రే కుట్రు రహదారిలో ఐఈడీ పేలుళ్లకు మావోయిస్టులు పాల్పడ్డారు. ఐఈడీ పేలిన సమయంలో పోలీసుల వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. 8 మంది జవాన్లతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.
IED Blast in Bijapur:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)