Weather Forecast: వణికిస్తున్న భారీ వర్షాలు, ఐదు రాష్ట్రాలకు రెడ్‌, 16 రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వానలు

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్‌, 16 రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Weather Update (photo-ANI)

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్‌, 16 రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌తో పాటు ఉత్తర భారత్‌లోని రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.  తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. జూన్‌ లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం

వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement