Rains (Credits: Pixabay)

Hyderabad, July 1: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుందని పేర్కొన్నది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో రానున్న మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ఏపీ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

జూన్‌ ముగిసేటప్పటికీ 159 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే ఎక్కువే. కాగా.. సోమవారం ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఎన్నికల ముందు జగన్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం