India-China Clash Row: సరిహద్దు గొడవలపై సంచలన నివేదిక బయటకు, భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణలు మరిన్ని జరిగే అవకాశం ఉందని తెలిపిన రాయిటర్స్

భారత్‌, చైనా సైనికుల మధ్య సరిహద్దులో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ ఓ నివేదిక బయటకు వచ్చింది. ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన అత్యున్నత పోలీసు అధికారుల సమావేశంలో ఈ రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

Image used for representational purpose | (Photo Credits: PTI)

భారత్‌, చైనా సైనికుల మధ్య సరిహద్దులో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ ఓ నివేదిక బయటకు వచ్చింది. ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన అత్యున్నత పోలీసు అధికారుల సమావేశంలో ఈ రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈ నివేదికపై భారత్‌, చైనా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఇప్పటి వరకు స్పందించలేదు.

ఈ నివేదిక ప్రకారం.. హిమాలయ ప్రాంతంలోని లడఖ్‌ వద్ద సైనికపరమైన మౌలిక సదుపాయాలను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) పెంచుతుండటం ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలకు దారితీయవచ్చని అంచనా వేసింది. భారత్‌-చైనా మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక మౌలిక నిర్మాణాలు చేపట్టడంతోపాటు బలగాలను పెంచుకుని బలాబలాలను పరీక్షించుకుంటున్నాయి’ అని అందులో పేర్కొన్నారు.

Here's Reuters Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement