Coronavirus in India: భారత్ లో 13శాతం తగ్గిన కరోనా రోజువారీ కేసులు, 9.27శాతానికి చేరిన డైలీ పాజిటివిటీ రేటు, ఆందోళనకర స్థాయిలో కరోనా మరణాలు
భారత్‌లో కరోనా తీవ్రత (Corona) క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే రోజువారీ కరోనా కేసులు (Daily corona cases) 13 శాతం తగ్గాయి. గురువారం నాడు కొత్తగా 1,49,394 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,19,52,712కు చేరాయి. ఇందులో 4,00,17,088 మంది బాధితులు కోలుకోగా, 5,00,055 మంది మృతిచెందారు.
New Delhi Feb 04: భారత్‌లో కరోనా తీవ్రత (Corona) క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే రోజువారీ కరోనా కేసులు (Daily corona cases) 13 శాతం తగ్గాయి. గురువారం నాడు కొత్తగా 1,49,394 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,19,52,712కు చేరాయి. ఇందులో 4,00,17,088 మంది బాధితులు కోలుకోగా, 5,00,055 మంది మృతిచెందారు.
మరో 14,35,569 మంది చికిత్స పొందుతున్నారు. అయితే మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. ఒక్కరోజే 1072 మంది కరోనా బారిన పడి మృతి(Corona Deaths) చెందారు. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,46,674 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం భారత్ లో కరోనా డైలీ పాజిటివిటీ రేటు (Daily positivity rate) కూడా భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా 168.47 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తగ్గగా, కేవలం కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ ల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న కేరళలో అత్యధికంగా కేరళలో 42,677 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 16,436, మహారాష్ట్ర 15,252, తమిళనాడు 11,993, రాజస్థాన్‌లో 8073 చొప్పున కేసులు నమోదయ్యాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)