Indian Army Drone Crosses LoC: ఎల్‌వోసీని దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్‌ అయిన భారత ఆర్మీ వ్యూహాత్మక డ్రోన్,స్వాధీనం చేసుకున్న పాక్ ఆర్మీ

ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీ డ్రోన్‌ను పాకిస్థాన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ సంఘటన జరిగింది.

Drone Representative Image (Photo Credit: Pixabay)

ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీ డ్రోన్‌ను పాకిస్థాన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ సాధారణ నిఘా మిషన్‌లో పాల్గొన్నది. అయితే కంట్రోల్‌ కోల్పోయిన ఆ డ్రోన్‌ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను దాటి పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించింది.అక్కడ దిగిన ఆ డ్రోన్‌ను పాకిస్థాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది.ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) స్థాయి అధికారులతో ఇండియన్‌ ఆర్మీ అధికారులు ఈ సంఘటనపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తున్నది. యూపీలో కూలిన ప్రైవేట్ స్కూల్‌ బిల్డింగ్‌, 40 మంది విద్యార్థులకు గాయాలు

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement