IndiGo Aircraft Grounded: ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, విమానం ల్యాండ్ అవుతుండగా నేలకు తాకిన తోక భాగం
విమానం ల్యాండ్ అవుతుండగా దాని తోక (tail) భాగం నేలకు తాకింది.
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టు (Delhi IGI Airport)లో ఇండిగో (IndiGo) విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతుండగా దాని తోక (tail) భాగం నేలకు తాకింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.కోల్ కతా – ఢిల్లీ ఇండిగో వీటీ-ఐఎంజీ విమానం జూన్ 11వ తేదీన కోల్ కతా నుంచి వచ్చింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా.. ప్రమాదవశాత్తు దాని తోక భాగం రన్ వేపై నేలను తాకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో విమానం దెబ్బతినడంతో దాని సర్వీసులను అధికారులు నిలిపివేశారు.
ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)