Ink Attack on Rakesh Tikait: రాకేష్‌ టికాయత్‌పై కర్ణాటకలో ఇంకు దాడి, దాడికి పాల్పడింది చంద్రశేఖర్‌ మద్ధతుదారులేనని తెలిపిన టికాయత్‌

రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. రసాభాసా నెలకొంది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు.

Rakesh Tikait Photo-ANI)

రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. రసాభాసా నెలకొంది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు. టికాయత్‌తోపాటు యుద్విర్‌ సింగ్‌ ముఖంపై నల్లసిరా చల్లింది ఆయన వ్యతిరేక వర్గమని తెలుస్తోంది. అంతేకాదు ఆయనపై కుర్చీలు విసిరారు నిరసనకారులు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్‌ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్‌, సింగ్‌లు వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. ఆ ఘటనలో తమ ప్రమేయం లేదంటూ వాళ్లు వివరణ ఇవ్వబోతుండగా.. కొందరు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. దాడికి పాల్పడింది చంద్రశేఖర్‌ మద్ధతుదారులేనని టికాయత్‌ చెప్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now