Instagram Down ? ఇన్‌స్టాగ్రామ్ డౌన్, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం, ఎక్స్ వేదికగా ఫిర్యాదుల చేస్తున్న నెటిజన్లు
దీనిపై యూజర్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. తమకెదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ డౌన్ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేస్తున్నారు. కొందరు అప్పుడే మీమ్స్ మొదలు పెట్టేశారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో (Instagram) అంతరాయం ఏర్పడింది.. దీనిపై యూజర్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. తమకెదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ డౌన్ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేస్తున్నారు. కొందరు అప్పుడే మీమ్స్ మొదలు పెట్టేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇన్‌స్టా సేవల్లో సాంకేతిక ఇబ్బందులు ప్రారంభమైనట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 2వేల ఫిర్యాదులు నమోదయ్యాయి. డైరెక్ట్ మెసేజులు (DM) పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. దీనిపై ఇన్‌స్టా ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు.
Instagram Faces Outage