International Yoga Day 2022: వైరల్ వీడియో.. 7 వేల ఫీట్ల ఎత్తులో జవాన్లు యోగసనాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగసనాలు వేసిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు
తమ ఆసనాలతో యోగా డేలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గత 8 ఏళ్ల నుంచి ఐటీబీపీ ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు హిమాలయ శ్రేణుల్లో ఇవాళ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తమ ఆసనాలతో యోగా డేలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గత 8 ఏళ్ల నుంచి ఐటీబీపీ ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిమ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఐటీబీ పోలీసులు యోగాసనాలతో తమ శరీర ధారుఢ్యాన్ని పెంచుకుంటున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఐటీబీపీ ఓ పాటను రాసి పాడారు.
గౌహతిలోని బ్రహ్మపుత్ర నది తీరంలోని లచిత్ ఘాట్ వద్ద 33వ బెటాలియన్‌కు చెందిన ఐటీబీపీ పోలీసులు యోగాను నిర్వహించారు. సిక్కిమ్‌లో మంచు విపరీతంగా ఉన్న ప్రదేశంలో సుమారు 17 వేల ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ హిమవీరులు యోగా ప్రాక్టీస్ చేశారు. ఉత్తరాఖండ్‌లో కూడా సుమారు 16 వేల ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ హిమవీరులు యోగా చేశారు.హిమాచల్ ప్రదేశ్‌లో 16500 ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ హిమవీరులు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. చత్తీస్‌ఘడ్‌లోని నారాయణ్‌పూర్‌లో కూడా ఐటీబీపీ పోలీసులు యోగాలో పాల్గొన్నారు. ఇక లడాఖ్‌లో సుమారు 17 వేల ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ దళం యోగా నిర్వహించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్‌పురలో కూడా ఐటీబీపీ యోగా ఈవెంట్ నిర్వహించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)