Jammu and Kashmir Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం, జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడిన బస్సు, 32 మంది అక్కడికక్కడే దుర్మరణం, 22 మందికి తీవ్ర గాయాలు
దోడా (Doda) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. బటోట్-కిష్త్వార్ (Kishtwar) జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో (Assar region) బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జమ్మూ డివిజన్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు.
జమ్మూ కశ్మీర్‌లో (Jammu And Kashmir) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోడా (Doda) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. బటోట్-కిష్త్వార్ (Kishtwar) జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో (Assar region) బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జమ్మూ డివిజన్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. బస్సు రోడ్డుపై నుంచి 300 అడుగుల లోతులో పడిపోయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 25 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఘటనలో తీవ్రంగా గాయపడినవారిని దోడా, కిష్త్వార్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు గాయపడిన వారిని తరలించేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)