Jharkhand Train Accident: జార్ఖండ్ ఘోర రైలు ప్రమాదానికి కారణాలు వెలుగులోకి, మంటల భయంతో ప్రక్క ట్రాక్ మీదకు దూకగానే ఎదురుగా వచ్చి ఢీకొట్టిన మరో రైలు
జార్ఖండ్‌లోని జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి రైలు (Jharkhand Train Accident) దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
జార్ఖండ్‌లోని జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి రైలు (Jharkhand Train Accident) దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్‌కు సమీపంలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశాడు. అయితే రైలు మార్గం అంచు నుంచి దుమ్ము లేవడంతో మంటలు చెలరేగుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు రైలు దిగారు.
పక్కన నున్న ట్రాక్‌పై నిలబడి ఉండగా ఇదే సమయంలో అటుగా వచ్చిన మరో ప్యాసింజర్ ట్రైన్ ప్రయాణికుల మీద నుంచి (Train Runs Over Passengers) దూసుకెళ్లింది. కాగా సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మరికొన్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జార్ఖండ్‌లో ట్రాక్ దాటుతుండగా ప్రయాణికులను ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడి నుజ్జు నుజ్జు అయిన వారి శరీరాలు
Here's Videos