Jitendra Awhad Remarks Row: వీడియో ఇదిగో, ఆ మాంసాహారం వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిన అవద్, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని వెల్లడి

వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అవద్ మళ్లీ స్పందించారు. "మాంసాహారం" వ్యాఖ్యపై.. నేను నా విచారం వ్యక్తం చేస్తున్నాను, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు" అని అన్నారు.

Jitendra Awhad (photo-ANI)

మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి విదితమే. రాముడు నాన్ వెజ్ తింటాడని అతను క్షత్రియుడంటూ వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలపై జితేంద్ర అవద్ స్పందిస్తూ..రాముడు ఏమి తిన్నాడనే విషయంపై వివాదం ఎందుకుని ప్రశ్నించిన అవద్.. రాముడు క్షత్రియుడు.

క్షత్రియులు మాంసాహారులు. వారు తప్పకుండా నాన్ వెజ్ ను తిన్నారన్నారు. అంతే కాకుండా తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, దేశ జనాభాలో 80% మంది మాంసాహారులు, వారు కూడా రామభక్తులు అని చెప్పడం కొసమెరుపు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అవద్ మళ్లీ స్పందించారు. "మాంసాహారం" వ్యాఖ్యపై.. నేను నా విచారం వ్యక్తం చేస్తున్నాను, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు" అని అన్నారు.  శ్రీరాముడు మాంసాహారే, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తెలిపిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement