మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయోధ్య మందిరం ప్రారంభించనున్న జనవరి 22ను డ్రై డేగా, మాంసాహార నిషేధ దినోత్సవంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.14 సంవత్సరాలు అడవిలో నివసించిన వ్యక్తి నాన్ వెజ్ తినకుండా.. శాకాహారమే ఎలా తినగలిగాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన వ్యాఖ్యలపై జితేంద్ర అవద్ స్పందించారు. రాముడు ఏమి తిన్నాడనే విషయంపై వివాదం ఎందుకుని ప్రశ్నించిన అవద్.. రాముడు క్షత్రియుడు.క్షత్రియులు మాంసాహారులు. వారు తప్పకుండా నాన్ వెజ్ ను తిన్నారన్నారు. అంతే కాకుండా తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, దేశ జనాభాలో 80% మంది మాంసాహారులు, వారు కూడా రామభక్తులు అని చెప్పడం కొసమెరుపు. రాముడు శాకాహారి కాదన్న అవద్ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. అతని వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు నిరసనలు చేస్తున్నారు.

దీనిపై బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉంటే, శివసేనకు చెందిన సామ్నా వార్తాపత్రికలో 'రామ్ మాంసాహారం' అంశంపై విమర్శనా వ్యాసాలు రాసేదని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ అన్నారు. ఎన్నికలు రాగానే హిందుత్వం గురించి మాట్లాడతారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Here's Jitendra Awhad Video

Here's BJP MLA Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)