Karan Bhushan Convoy Accident: బీజేపీ ఎంపీ కొడుకు కరణ్ కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతి, చిక్కుల్లో బ్రిజ్‌భూషణ్‌, వీడియో ఇదిగో..

ఆయన తనయుడు కరణ్ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.

Screenshot of the video (Photo Credit- X/@scribe_prashant)

మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Singh) మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన తనయుడు కరణ్ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా నగర సమీపంలోని రహదారిపై ఈ ఘటన జరిగింది. దీనిపై ఫిర్యాదు నమోదైంది. తన కుమారుడు(17), సమీప బంధువు(24) బైక్‌పై బయటకు వెళ్లారని, అప్పుడే ఎదురుగా వచ్చిన కారు వారిని ఢీకొట్టిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దాంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు చెప్పారు.  ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి?, నెటిజన్లను ప్రశ్నించిన వీసీ సజ్జనార్, అతివేగమా, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా మీరే చెప్పండి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)