CM Basavaraj Bommai: వెక్కి వెక్కి ఏడ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, 777 చార్లీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న బొమ్మై, సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్
777 చార్లీ అనే సినిమా చూసి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడ్చేశారు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాలో పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని చూపించారు. అయితే సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు.
777 చార్లీ అనే సినిమా చూసి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడ్చేశారు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాలో పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని చూపించారు. అయితే సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ సినిమా చూస్తూ ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారని తెలిసింది.
సినిమా చూసిన అనంతరం సీఎం బొమ్మై మాట్లాడుతూ ‘కుక్కల గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని చాలా గొప్పగా చూపించారని కొనియాడు. కుక్క తన భావోద్వేగాలను కండ్ల ద్వారా వ్యక్తపరుస్తుంది. సినిమా బాగుంది. అందరూ చూడాల్సిందే అన్నారు. కుక్కల ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ. ఇది స్వచ్ఛమైన ప్రేమ` అని అన్నారు. బొమ్మై స్వతహాగా కుక్కల ప్రేమికుడు. గతేడాది తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆయన బాధపడ్డారు.