Cobra Swallows Plastic Box: ప్లాస్టిక్ డబ్బా మింగిన నాగుపాము, శస్త్ర చికిత్స ద్వారా ఆ డబ్బాను తొలగించిన వైద్యులు, కర్ణాటకలో ఘటన

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మంగళూరులో ప్లాస్టిక్ డబ్బా (plastic box)ను మింగేసిన ఓ నాగుపాము (Cobra)కు వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు.

Snake (credit- IANS)

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మంగళూరులో ప్లాస్టిక్ డబ్బా (plastic box)ను మింగేసిన ఓ నాగుపాము (Cobra)కు వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు. బంట్వాళ సమీపంలోని సాలుమరాడ తిమ్మక్క పార్కు సమీపంలోగల ఓ గుంతలో నాగు పాము గాయాలతో ఉండటాన్ని గమనించిన ఓ పాముల సంరక్షకుడు దాన్ని స్థానికంగా ఉన్న పశువైద్యశాలకు తీసుకెళ్లాడు.

పామును పరిశీలించిన డాక్టర్ యశశ్వి బృందం కడుపు ఉబ్బి ఉండటాన్ని గమనించి ఎక్స్ రే తీశారు. పాము కడుపులో ప్లాస్టిక్ పదార్థం ఉండటాన్ని గుర్తించారు. దీంతో వెంటనే శస్త్ర చికిత్స ద్వారా పాము పొట్టలోని ప్లాస్టిక్ డబ్బాను తొలగించారు. అనంతరం 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అది కోలుకున్న తర్వాత ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు డాక్టర్ యశశ్వి తెలిపారు.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement