Hyd, Sep 28: జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్టు సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకువచ్చింది. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది దేవర.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం దేవర తొలి రోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ 7 కోట్లు, కన్నడః 30 లక్షలు,తమిళంః 80 లక్షలు, మలయాళంః 30 లక్షలు రాబట్టగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో భారీగా వసూళ్లు చేసింది దేవర. నా తమ్ముడు హిట్ కొట్టేశాడు! దేవర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ పై కల్యాణ్ రామ్ కామెంట్స్
అమెరికా మార్కెట్లో ప్రీమియర్ ప్రదర్శనల నుండి $2.8 మిలియన్లకు పైగా వసూలు చేసింది. అయితే కల్కి రికార్డును మాత్రం అధిగమించలేకపోయాడు ఎన్టీఆర్. కల్కి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 191.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఆచార్య సినిమాతో డిజాస్టర్‌ను మూటగట్టుకున్న కొరటాల శివ...దేవర సినిమాతో తన సత్తాచాటాడు.