Karnataka Road Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, కాలువలో కారు పడిపోవడంతో ఐదుగురు మృతి, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కర్నాటకలో మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు. విశ్వేశ్వరయ్య కాలువలో బుధవారం కారు పడిపోవడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.
కర్నాటకలో మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు. విశ్వేశ్వరయ్య కాలువలో బుధవారం కారు పడిపోవడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. ఘటనా స్ధలానికి చేరుకున్న సహాయ సిబ్బంది కాలువ నుంచి మృతదేహాలను వెలికితీశారు.
మృతులందరూ తుముకూరు జిల్లాలోని తిప్తూర్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మైసూర్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొని తిరిగివస్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతులను చంద్రప్ప, కృష్ణప్ప, ధనుంజయ్, బాబు, జయన్నగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)