Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియోలు ఇవిగో, లోయలో పడిన ట్రక్కు, కూరగాయలు అమ్మేందుకు వెళుతున్న 10 మంది అక్కడికక్కడే మృతి, మరో 15 మందికి గాయాలు
కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యల్లాపుర సమీపంలో ఓ ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరంతా సావనూర్ నుంచి యల్లాపుర సంతకు పండ్లను విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యల్లాపుర సమీపంలో ఓ ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరంతా సావనూర్ నుంచి యల్లాపుర సంతకు పండ్లను విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలోని సావనూర్ – హుబ్బళి రహదారిపై అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని ఎస్పీ తెలిపారు.
ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ట్రక్కు డ్రైవర్ మరొక వాహనానికి దారి ఇచ్చే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లిందని తెలిపారు. ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను హుబ్బలిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం వేచి ఉంది.
Karnataka Road Accident:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)