Karnataka Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో కాలి బూడిదైన బస్సు, 8 మంది సజీవ దహనం, మరి కొందరికి తీవ్రగాయాలు, ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 12 మందిని రక్షించి స్థానికులు ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రయివేటు బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)