Karnataka: తీవ్ర విషాదం, ట్రక్కు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, అదుపుతప్పి వాహనాల మీదకు దూసుకెళ్లడంతో ఒకరు మృతి, చివరకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిన వాహనం
కర్ణాటకలోని కలబురగిలో బుధవారం రాత్రి ట్రక్కు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ట్రక్కు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో వరుస ప్రమాదాలు సంభవించాయి, దీని ఫలితంగా ఒకరు మరణించారు
కర్ణాటకలోని కలబురగిలో బుధవారం రాత్రి ట్రక్కు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ట్రక్కు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో వరుస ప్రమాదాలు సంభవించాయి, దీని ఫలితంగా ఒకరు మరణించారు.యాద్గిర్ జిల్లాలోని షాపూర్ నుండి కలబురగి వైపు ప్రయాణిస్తున్న ట్రక్కు నడుపుతున్న డ్రైవర్ కు మెడికల్ ఎమర్జెన్సీ (Truck Driver Suffers Heart Attack) ఎదురైనప్పుడు అదుపు తప్పింది.
ఆ ట్రక్కు అనేక ఆటోలు, బైక్‌లు, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి చివరికి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో 32 ఏళ్ల కూరగాయల వ్యాపారి మహ్మద్ అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన డ్రైవర్‌ను వెంటనే చికిత్స కోసం కలబురగి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జెవర్గి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరాల్లోకి వెళితే.. ట్రక్కు యాద్గిర్ (Yadgir) జిల్లాలోని షాపూర్ నుంచి కలబురగి వైపు వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవింగ్ సమయంలో ట్రక్కు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో ట్రక్కు అనేక వాహనాలను ఢీ కొట్టింది. చివరికి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో 32 ఏళ్ల కూరగాయల వ్యాపారి మహ్మద్ అలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ట్రక్కు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)