Kerala: రెండు రోజుల పాటు కొండ చీలికలో చిక్కుకున్నకేరళ యువకుడు, ఆర్మీ రంగ ప్రవేశంతో బాబు ప్రాణాలతో బయటకు..
ఇవాళ ఉదయం పాలక్కాడ్ జిల్లాలో మలపుజా వద్ద ఉన్న కురుంబాచి కొండ చీలికలో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది.
కేరళలో దాదాపు రెండు రోజుల పాటు కొండ చీలికల మధ్య చిక్కుకున్న 23 ఏళ్ల యువకుడిని ఆర్మీ రక్షించింది. ఇవాళ ఉదయం పాలక్కాడ్ జిల్లాలో మలపుజా వద్ద ఉన్న కురుంబాచి కొండ చీలికలో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ముందుగా ఆ కుర్రాడికి ఆహారం, నీటిని ఆర్మీ అందించింది. దాదాపు 43 గంటలుగా ఆర్.బాబు అనే యువకుడు ఆ కొండ చీలికలోనే ఉన్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన బాబు.. ఆ కొండను దిగే సమయంలో అలసిపోయి కాలుజారి పడ్డాడు. అయితే కిందపడే క్రమంలో అతను ఆ కొండల్లో ఉన్న చీలిక ప్రదేశంలో చిక్కుకున్నాడు. అతని మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా.. బాబును వాళ్లు రక్షించలేకపోయారు. ఇవాళ ఆర్మీ రంగ ప్రవేశంతో బాబు ప్రాణాలతో బయటపడ్డాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)