Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడి రెండు ముక్కలైన జీపు, తొమ్మిది మంది మహిళలు అక్కడికక్కడే మృతి, మరో 5 గురికి తీవ్ర గాయాలు
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్ లోయలోకి దూసుకెళ్లి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్ లోయలోకి దూసుకెళ్లి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం మనంథావాడీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా వయనాడ్‌కు చెందిన వాళ్లని.. టీఎస్టేట్‌లో పని చేసే కూలీలుగా నిర్ధారణ అయ్యింది. 25 మీటర్ల లోయలో అతి వేగంగా జీపు పడడంతో.. అది రెండు ముక్కలైంది. మృతదేహాలను వయనాడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు.. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు.
Here's ANI VIdeo
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)