Kuwait: భారత్ విమానాలపై నిషేధం విధించిన కువైట్, భారత్‌లో కరోనా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని తెలిపిన అధికారులు
నేరుగా భారత్ నుంచి వచ్చినా, ఇతర దేశాల మీదుగా వచ్చినా శనివారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బ్యాన్ అమలులో ఉంటుందని కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. ఇప్పటికే కెనడా, యూఏఈ, ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోగా.. బ్రిటన్ రెడ్‌లిస్ట్‌లో పెట్టింది కువైట్ సైతం అదేబాట పట్టింది.
భారత్‌లో కరోనా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఆరోగ్య అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే, కువైట్ పౌరులు, మొదటి డిగ్రీ బంధువులు (భర్త, భార్య, పిల్లలు), పని కార్మికులకు అనుమతి ఉంటుందని చెప్పింది. యూఏఈ నుంచి భారత్‌కు ప్రయాణికులకు వెళ్లేందుకు రెండుదేశాల మధ్య సర్వీసులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నిషేధంతో సరుకు రవాణాపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)