Lucknow Accident: ఓవర్ లోడ్ ఫలితం, ట్రాక్టర్ బోల్తా పడి తొమ్మిది మంది మృతి, బోల్తా కొడుతూ మెయిన్‌ రోడ్డు పక్కనే ఉన్న నీటి కొలనులో పడిపోయిన ట్రాక్టర్

లక్నో శివారులోని ఇటావుంజా దగ్గర కిక్కిరిసిన జనంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ బోల్తా కొట్టి నీటి కొలనులో పడిపోగా.. తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు.ఓవర్‌లోడ్‌ కారణంగా ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా కొడుతూ మెయిన్‌ రోడ్డు పక్కనే ఉన్న నీటి కొలనులో పడిపోయింది.

Lucknow Accident. (Photo Credits: ANI)

యూపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. లక్నో శివారులోని ఇటావుంజా దగ్గర కిక్కిరిసిన జనంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ బోల్తా కొట్టి నీటి కొలనులో పడిపోగా.. తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు.ఓవర్‌లోడ్‌ కారణంగా ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా కొడుతూ మెయిన్‌ రోడ్డు పక్కనే ఉన్న నీటి కొలనులో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది. స్థానికుల సాయంతో అధికారులు 37 మందిని రక్షించింది.తొమ్మిది మంది మృతి చెందినట్లు ఐజీ లక్ష్మిసింగ్‌ వెల్లడించారు.

మృతులంతా సీతాపూర్‌ అట్టారియాకు చెందిన వాళ్లుగా నిర్ధారణ అయ్యింది. నవరాత్రి సందర్భంగా ఇటావుంజాలోని ఉన్నాయ్‌ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలకు వెళ్తూ వీళ్లంతా ప్రమాదంలో మరణించారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించనున్నట్లు ప్రకటించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)