Madhra Pradesh: అర్థరాత్రి ఘోర ప్రమాదం, బైక్‌పై వస్తున్న వ్యక్తిని తప్పించబోయి బావిలో పడిన బొలెరా వాహనం, చిన్నారితో సహా ఏడుగురు దుర్మరణం, మరో ఆరుగురికి గాయాలు
మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లాలోని మోఖెడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడమావు గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది.
మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లాలోని మోఖెడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడమావు గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. గురువారం ఉదయం బావిలో నుంచి ఏడుగురి మృతదేహాలతో పాటు వాహనాన్ని పోలీసులు వెలికి తీశారు.భాజీపాని గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు వెళ్లి.. తిరిగి వస్తున్న సమయంలో బొలెరో వాహనం.. ఎదురుగా బైక్‌పై వస్తున్న వ్యక్తిని తప్పించబోయి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల పేర్కొన్నారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)