Madhya Pradesh Factory Blast: టపాసుల తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ఆరు మంది మంటల్లో సజీవదహనం, మరో 59 మందికి తీవ్ర గాయాలు
ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 59 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో హర్దా (Harda) జిల్లాలోని ఓ టపాసుల తయారీ ఫ్యాక్టరీలో ( firecracker factory) భారీ పేలుడు ( explosion) సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 59 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరాగఢ్ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది.
ఈ పేలుడు శబ్ధం దాదాపు రెండు కిలోమీటర్ల దాకా వినిపించింది. చుట్టుపక్కల 60 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. పేలుడు సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ సుమారు 100 ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. మంటల ధాటికి పలు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)