Khargone Road Accident: బస్సు ప్రమాద ఘటనలో 23కు పెరిగిన మృతుల సంఖ్య, మరో 25 మందికి పైగా గాయాలు, వంతెనపై నుంచి నదిలో పడిపోయిన బస్సు
మరో 25 మందికిపైగా గాయపడ్డారు. శ్రీఖండి నుంచి ఇండోర్ (Indore) వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖర్గోన్ (Khargone) జిల్లాలో వంతెన (Bridge) పై నుంచి నదిలో పడిపోయిన విషయం తెలిసిందే
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఖర్గోన్‌లో మంగళవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. శ్రీఖండి నుంచి ఇండోర్ (Indore) వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖర్గోన్ (Khargone) జిల్లాలో వంతెన (Bridge) పై నుంచి నదిలో పడిపోయిన విషయం తెలిసిందే. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రెయిలింగ్‌ను ఢీ కొట్టిన అనంతరం బస్సు 50 అడుగుల కిందున్న నదిలోకి పడిపోయింది.ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Video