Madhya Pradesh Road Accident: కుటుంబాన్ని చిదిమేసిన ద‌ట్ట‌మైన పొగమంచు, ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గునా జిల్లాలో ఈ రోజు ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద‌ట్ట‌మైన పొగ మంచు మ‌ధ్య‌లో కారును ట్ర‌క్కు ఓవ‌ర్ టేక్ చేయ‌బోయింది. ఈ క్ర‌మంలో ట్ర‌క్కు కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి చెందారు

Representative Image

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గునా జిల్లాలో ఈ రోజు ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద‌ట్ట‌మైన పొగ మంచు మ‌ధ్య‌లో కారును ట్ర‌క్కు ఓవ‌ర్ టేక్ చేయ‌బోయింది. ఈ క్ర‌మంలో ట్ర‌క్కు కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను రాజ్‌ఘ‌ర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో భార్యాభ‌ర్త‌లు, వారి కూతుళ్లు ఇద్ద‌రు ఉన్నారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement