Madhya Pradesh Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, బాలికకు ఉచితంగా ఐసీ క్రీం ఇస్తానంటూ లైంగిక దాడి, వీడియో రికార్డు చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు
ఈ ఘటన అక్కడున్న వారు రికార్డు చేశారు. ఇక వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసిన గుర్తు తెలియని నిందితుడిని కూడా ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జహంగీరాబాద్‌లో ఐస్‌క్రీం అమ్మే వ్యక్తి 11 ఏళ్ల బాలికకు ఉచితంగా ఐస్‌క్రీం ఇప్పిస్తానని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన అక్కడున్న వారు రికార్డు చేశారు. ఇక వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసిన గుర్తు తెలియని నిందితుడిని కూడా ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడు తమ్ముడేనా, అక్కపై గొడ్డలితోదారుణంగా ఎలా దాడి చేస్తున్నాడో చూడండి, ఆస్తి వివాదాలే కారణం, వీడియో ఇదిగో..
జూన్ 28 రాత్రి, ఆమె కుమార్తె తన ఇంటి సమీపంలోని వ్యాపారి వద్ద ఐస్‌క్రీం కొనడానికి వెళ్లింది. అక్కడ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. ఇంతలో, ఈ సంఘటనను ఎవరో వీడియో రికార్డ్ చేసి మరుసటి రోజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. జూన్ 30న కుటుంబ సభ్యులు వీడియో చూసి బాలికను ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు జహంగీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలోని కల్పి నివాసి ప్యారే ఖాన్ అలియాస్ ఖలీద్ (52)గా గుర్తించారు.అతడిని కోర్టులో హాజరుపరచగా, అక్కడి నుంచి జైలుకు తరలించారు. వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన నిందితుడిని ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చి అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)