Madhya Pradesh Shocker: వైరల్ వీడియో, టోల్‌ ఫీజు చెల్లించమన్నందుకు మహిళపై చేయి చేసుకున్న కారు డ్రైవర్, ఎదురు తిరిగి అతడ్ని చెప్పుతో కొట్టిన మహిళ, సోషల్ మీడియాలో వైరల్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టోల్‌ రుసుం చెల్లించాలని అడిగిన టోల్‌ బూత్‌ మహిళా ఉద్యోగిని ఒక వ్యక్తి చెంప దెబ్బ కొట్టాడు. దీంతో ఆమె కూడా ఎదురు తిరిగి అతడ్ని చెప్పుతో కొట్టింది. రాజ్‌గఢ్-భోపాల్ రహదారిలోని కచ్నారియా టోల్ ప్లాజాకు రాజ్‌ కుమార్ గుర్జార్ అనే వ్యక్తి కారులో వచ్చాడు.

Man Slaps Woman Toll Booth Employee in Rajgarh

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టోల్‌ రుసుం చెల్లించాలని అడిగిన టోల్‌ బూత్‌ మహిళా ఉద్యోగిని ఒక వ్యక్తి చెంప దెబ్బ కొట్టాడు. దీంతో ఆమె కూడా ఎదురు తిరిగి అతడ్ని చెప్పుతో కొట్టింది. రాజ్‌గఢ్-భోపాల్ రహదారిలోని కచ్నారియా టోల్ ప్లాజాకు రాజ్‌ కుమార్ గుర్జార్ అనే వ్యక్తి కారులో వచ్చాడు. అయితే అతడి వాహనానికి ఫాస్టాగ్‌ లేదు. దీంతో టోల్‌ ట్యాక్స్‌ కట్టాలని అక్కడి మహిళా ఉద్యోగిని అనురంద డాంగి అడిగింది.

వెంటనే కారు దిగి వచ్చి మహిళా ఉద్యోగిని చెంపపై కొట్టాడు. అయితే ఆమె కూడా ఎదురు తిరిగింది. తన కాలి చెప్పుతో అత్నడి కొట్టింది. దీంతో అతడు మరింతగా రెచ్చిపోయి ఆమెపై దాడి చేశాడు. మహిళా ఉద్యోగిని అనురంద ఫిర్యాదుతో పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ టోల్‌ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement