MP Shocker: మధ్యప్రదేశ్‌లో దారుణం, పొలం కబ్జాను అడ్డుకున్నందుకు గిరిజన మహిళకు నిప్పటించారు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళ

తన కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నందుకు ఒక గిరిజన మహిళకు నిప్పటించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో రాంప్యారీ బాయి అనే మహిళ ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.

Tribal woman set ablaze over land row critical (Photo-Video Grab)

తన కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నందుకు ఒక గిరిజన మహిళకు నిప్పటించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో రాంప్యారీ బాయి అనే మహిళ ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. బమోరి తహశీల్‌ పరిధిలోని ధనోరియా గ్రామ పొలంలో మహిళకు నిప్పంటించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. ఈ ఘటన చాలా సిగ్గు చేటని వ్యాఖ్యానించింది. పట్టపగలే దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించింది. ఈ ఘటనలో 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now