Maha Shivaratri Celebrations: కాశీలో నాగ‌సాధువుల ఊరేగింపు వీడియో ఇదిగో, సాధువుల‌పై పూల వ‌ర్షం కురిపించిన యూపీ ప్ర‌భుత్వం, కాశీ విశ్వేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్న సాధువులు

మ‌హాశివ‌రాత్రి పండుగల వేళ‌.. నాగ‌సాధువులు(Naga Sadhus) కాశీ విశ్వేశ్వ‌రుడి ఆలయాన్ని ద‌ర్శించుకున్నారు. శైవ సంప్ర‌దాయానికి చెందిన ఏడు అకాడాలతో పాటుగా గంగా ఘాట్ల నుంచి నాగసాధువులు విశ్వ‌నాథుడి ఆల‌యానికి ఊరేగింపుగా వెళ్లారు.

Mahashivratri Celebrations in Varanasi (Photo-ANI)

మ‌హాశివ‌రాత్రి పండుగల వేళ‌.. నాగ‌సాధువులు(Naga Sadhus) కాశీ విశ్వేశ్వ‌రుడి ఆలయాన్ని ద‌ర్శించుకున్నారు. శైవ సంప్ర‌దాయానికి చెందిన ఏడు అకాడాలతో పాటుగా గంగా ఘాట్ల నుంచి నాగసాధువులు విశ్వ‌నాథుడి ఆల‌యానికి ఊరేగింపుగా వెళ్లారు. ఆ స‌మ‌యంలోనాగ‌సాధువులు భారీ ప్రదర్శన చేశారు. ప్ర‌యాగ్‌రాజ్ నుంచి చేరుకున్న నాగ సాధువులు.. ఇవాళ ఉద‌యం కాశీలో విశ్వ‌నాథుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు, ఒక్కరోజే కోటి మందికి పైగా పవిత్ర స్నానాలు, మరి కొన్ని గంటల్లో ముగియనున్న మహా కుంభమేళా

నాగా సాధువుల జ‌లాభిషేకం కోసం ఆల‌య ద‌ర్శ‌న వేళ‌ల్లో మూడు గంట‌ల పాటు విరామం ఇచ్చారు అధికారులు. నాగ సాధువుల ర్యాలీకి చెందిన డ్రోన్ వీడియోను యూపీ అధికారులు రిలీజ్ చేశారు. సాధువుల‌పై ప్ర‌భుత్వం పూల వ‌ర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Maha shivratri Celebrations in Varanasi

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement