Shark Bites Fisherman Legs: చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన వ్యక్తి కుడి కాలు కొరికేసిన షార్క్, సోషల్ మీడియాలో వీడియో వైరల్..
మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన ఓ వ్యక్తిని భయంకరమైన షార్క్ చేప కాలు కొరికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనతో ఆగ్రహించిన మత్స్యకారులు వలతో ఆ షార్క్‌ను పట్టి ఒడ్డుకు తీసుకువచ్చి చంపేశారు.
మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన ఓ వ్యక్తిని భయంకరమైన షార్క్ చేప కాలు కొరికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనతో ఆగ్రహించిన మత్స్యకారులు వలతో ఆ షార్క్‌ను పట్టి ఒడ్డుకు తీసుకువచ్చి చంపేశారు. వీడియో ప్రకారం.. అరేబియా సముద్రంలోకి పారే వైతరుణి నదిలో చేపలు పట్టేందుకు 32 ఏళ్ల విక్కీ సురేష్ గోవారి దిగాడు.
అయితే ఆ నదిలో ఉన్న షార్క్ అతడి కుడి కాలుపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడి రక్తం ధారంగా కారడంతో అతడు అచేతనంగా పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నదిలో షార్క్ తిరగడం చూసి స్థానికులు వలలతో ఒక షార్క్‌ను బంధించి ఒడ్డుకు తెచ్చి చంపారు. ఈ వీడియోతో పాటు నదిలో తిరుగుతున్న షార్క్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)